Monday, April 29, 2024
- Advertisement -

ఎచ్చెర్ల.. కలిశెట్టికేకళా వెంకట్రావు ఖాళీయేనా!

- Advertisement -

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఓ వైపు జనసేనతో పొత్తు మరోవైపు సొంత పార్టీ నేతల నుండే పోరు…వెరసీ పలు నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేతలకు సీటు దొరకడం కష్టంగా మారింది. పలువురు సీనియర్ల పరిస్థితి ఇలాగే ఉండగా ప్రధానంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావ్ కు ఇప్పుడు ఇదే సమస్య వచ్చి పడింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గం ఎచ్చెర్ల.

2014లో నాన్ లోకల్ అయినా ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు కళా వెంకట్రావు. ఇక 2019లో ఆయన ఓడిపోగా టీడీపీలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేక నెలకొంది. నాన్ లోకల్ ముద్రతో పాటు ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని టీడీపీ నేతలు తేల్చిచెప్పిన సందర్భాలెన్నో. ఇక ఎచ్చెర్లలో బలంగా ఉన్న మరో టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు నుండి కళాకు తీవ్ర పోటీ నెలకొంది. వాస్తవానికి మొదటి నుండి కళా వెంకట్రావను వ్యతిరేకిస్తున్నారు కలిశెట్టి. అందుకే ఈసారి సీటు తనకేననే ధీమాతో ఉన్నారు కలిశెట్టి.

టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు. మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. అయితే ఈ సారి వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలని ప్లాన్ చేస్తున్న చంద్రబాబు..వెంకట్రావును తప్పించే ఆలోచనలో ఉన్నారట. అందుకే కలిశెట్టికి టికెట్ ఇవ్వాలని హై కమాండ్ చూస్తోంది. చంద్రబాబు జైలులో ఉన్న టైంలో రోజుకో రకమైన ఆందోళన చేస్తూ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఈ సారి సీనియర్ నేత అయిన కళా వెంకట్రావును తప్పించి కలిశెట్టికి సీటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -