Friday, May 17, 2024
- Advertisement -

ఎంబిబిఎస్, బిడీఎస్ సీట్ల కోసం

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఎంసెట్ పరీక్ష జరుగనున్నది. అయితే ఇది కేవలం ఎంబిబిఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే నిర్వహిస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం నీట్ పై ఆర్డినెన్స్ తీసుకువస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయం వెలువడిన తర్వాత ఈ అంశంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతస్ధాయి అధికారులతో సమావేశం జరిగింది.

ఎంసెట్ కు దరఖాస్తులు ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. దీంతో ఎంసెట్ లో ఎంబిబిఎస్, బీడీఎస్ కోర్సులను మినహాయించారు. ఆయుష్, వెటర్నరీ, వ్యవసాయ బీఎస్సీ కోర్సులకు మాత్రమే ఎంసెట్ నిర్వహించారు. తాజాగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించడంతో ఎంబిబిఎస్, బీడీఎస్ ల్లో ప్రవేశానికి ఎంసెట్ నిర్వహించాల్సిన అవసరం వచ్చింది.

ఇందుకు అనువుగా ముందు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం 40 లేదా 45 రోజుల తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిని బట్టి చూస్తే ఎంసెట్ 2 జూన్ చివరి వారంలో కాని, జూలై మొదటివారంలో కాని జరిగే అవకాశాలున్నాయి. ఈ పరీక్ష కోసం మళ్లీ ప్రశ్నాపత్రాలకు తయారు చేయాల్సిన అవసరం ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -