Thursday, May 16, 2024
- Advertisement -

ఏపీలో విడుద‌ల‌యిన టెన్త్ ఫ‌లితాలు..బాలిక‌లే టాప్‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫ‌లితాల్లో అమ్మాయిలు అద‌ర‌గొట్టారు.ఏపీలో 6,21,634 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాశారని సంధ్యారాణి తెలిపారు. మొత్తం 94.88 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

బాలురు 94.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిల్లో 95.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటుగా పరీక్ష రాసిన విద్యార్థుల ఉత్తీర్ణత 58.80 శాతం నమోదయిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. 5400 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 98.19 శాతం ఉత్తీర్ణతతో తూర్పగోదావరి జిల్లా టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. 83.19 శాతంతో నెల్లూరు జిల్లా అట్టడుగున నిలిచింది. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్‌ 17 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు

ఫలితాల కోసం..

ఆర్టీజీఎస్ వెబ్‌సైట్.. www.rtgs.ap.gov.in
పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్.. https://bit.ly/2E1cdN7
ఖైజాలా యాప్.. https://aka.ms/apresult

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -