Monday, May 20, 2024
- Advertisement -

ఆంబోతుల మాదిరి వ్య‌వ‌హ‌రిస్తే చూస్తూ ఊరుకోం….చంద్ర‌బాబు

- Advertisement -

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఆంబోతుల మాదిరి బజారున పడితే సహించేది లేదన్న ఆయన ఆడవారి జోలికెళ్తే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందేనని హెచ్చరించారు. దాచేపల్లి ఘటనలో అత్యాచారానికి గురైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఆయన పరామర్శించారు.

దాచేపల్లి ఘటన చాలా బాధాకరం, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నాగరిక ప్రపంచం సిగ్గుపడాలని, రాష్ట్రానికి సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా కఠినంగా శిక్ష పడేలా చేస్తామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం దారుణమంటూ పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. దారుణ సంఘటన నేపథ్యంలో ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. బాధితురాలికి సంఘీ భావంగా సోమవారం ప్రతి మండలంలో ర్యాలీ నిర్వహిస్తామని, ‘ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం’ అంటూ నిర్వహించే ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -