Sunday, May 19, 2024
- Advertisement -

ప‌రిపాల‌న‌లో దూకుడు పెంచిన జ‌గ‌న్ ….పథకాల పేర్ల మార్పునకు శ్రీకారం

- Advertisement -

ప‌రిపాల‌న‌లో జ‌గ‌న్ త‌న‌ముద్ర వేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క అధికారుల‌ను బ‌దిలీ చేసిన జ‌గ‌న్ ఇప్పుడు టీడీపీ హాయాంలో ఉన్న ప‌థ‌కాల పేర్ల మార్పుపై దృష్టి సారించారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా దేశం చూపును ఏపీ వైపు తిప్పుకొనేలా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఇందుకు త‌గిన‌ట్లుగా అడుగులు వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల మార్పునకు శ్రీకారం చుట్టారు.

విద్యార్ధుల‌కు నాణ్మ‌మైన విద్య, మ‌ధ్యాహ్న భోజ‌నం అందించాల‌నె విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాడెప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో భోజన పథకం. అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. జగన్ ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్కూల్స్ లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలని అన్నారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ‘వైఎస్సార్‌ అక్షయ పాత్ర’గా మార్పు చేస్తూ ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వారి గౌరవ వేతనం రూ.3000కు పెంచాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించిన జగన్… ఆహారం నాణ్యత విషయంలో రాజీపడవద్దని ఆదేశించారు. పరిశుభ్రతను పాటించాలని, సకాలంలో ఆహారం పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -