Thursday, April 18, 2024
- Advertisement -

ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త..

- Advertisement -

ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారు. ఈరోజు ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,143 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిధ్దమవుతోంది. 2021-22లో వివిధ శాఖ‌ల్లో భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం అత్యధిక ప్రాధాన్య‌త ఇస్తోంది.. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేప‌ట్టాల‌ని.. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేప‌ట్టాల‌ని ప‌లు సంద‌ర్భాల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు.

ఈ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఆర్ధికశాఖ ఆమోదంతో విడతల వారీగా పరీక్షలు నిర్వహించి ఏపీపీఎస్సీ ఈ ప్రక్రియ చేపడుతుంది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఓ క్రమ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రూపోందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు దూసుకు వెళుతున్నారు.

ఇక‌ ఆ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238 పోస్టులు, ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్ 2లో 36 పోస్టులు, పోలీస్‌ శాఖలో 450 ఉద్యోగాలు, వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451 పోస్టులు, పారామెడికల్‌ సిబ్బంది 5,251 పోస్టులు, నర్సులు 441 పోస్టులు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240 పోస్టులు, వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000 పోస్టులు, ఇతర శాఖలల్లో 36 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

రక్షణకు గార్డులు, కుక్కలు కాపలా.. వామ్మో ఆ మామిడి పండ్లకు ఇంత సెక్యూరిటా..!

పెళ్లి తర్వాత అలాంటి పాత్రలో నటించనున్న కాజల్!

నేటి పంచాంగం,శుక్రవారం(18-06-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -