Sunday, May 19, 2024
- Advertisement -

ఆ రాష్ట్రాలు కూడా ఏపీలో విలీనం అవుతాయా…?!

- Advertisement -

తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా ఉత్సాహంతో ఉన్నారిప్పుడు. అధినేత చంద్రబాబు నాయుడు సోమిరెడ్డికి ఎట్టకేలకూ  ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడంతోసోమిరెడ్డి ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఎట్టకేలకూ తన కల ఫలించిందన్న ఆనందం కనిపిస్తోందాయనలో. ఇదే ఉత్సహంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధినేత పై అతి ప్రేమను కనబరుస్తున్నాడాయన.

ఈ అతి ప్రేమలో ఆయన తను ఏం మాట్లాడుతున్నానో.. కూడా మరిచినట్టుగా ఉన్నాడు. తాజాగా సోమిరెడ్డి ఏమన్నారంటే.. బాబుగారు ఏపీని అభివృద్ధి చేస్తున్న తీరును గమనించి తెలంగాణ ప్రజలు కూడా తమ రాష్ట్రాన్ని ఏపీలో విలీనం చేయాలని అడుగుతారని సోమిరెడ్డి చెబుతున్నారు! చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఏపీని అభివృద్ధి చేస్తున్నాడని ఆయన అంటున్నాడు.

ఇది పరాకాష్ట అనుకోవచ్చు. బాబు గారిని ప్రశంసించడంలో సోమిరెడ్డి ఈ విధంగా రెచ్చిపోతున్నాడని చెప్పవచ్చు. మరి మొన్నటి వరకూ పోరాడి తెలంగాణను సాధించుకొన్న ఈ ప్రాంతం వారు ఇప్పుడు బాబుగారి పాలనను చూసి ఆంధ్రలో కలిసిపోతామని అంటున్నారని సోమిరెడ్డి చెప్పుకొస్తున్నాడు. మరి ఇలాంటి కోరిక కేవలం తెలంగాణ వారికేఉంటుందా? ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలు బాబు పాలనను మెచ్చి ఏపీలో విలీనం అవుతామనే ప్రతిపాదనను తీసుకురావా?! అనే సెటైర్లు పడుతున్నాయిప్పుడు. మరి దీనికి సోమిరెడ్డే సమాధానం చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -