ఉత్తర్ప్రదేశ్ బదాయూ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.
50 ఏళ్ల మహిళను అత్యాచారం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సత్య నారాయణ ఇంతకాలం పరారీలో ఉన్నాడు. ఉగైతీ పోలీస్స్టేషన్ పరిధిలోని అతని సహచరుని ఇంట్లో తల దాచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. పక్కా సమాచారంతో అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ నెల 3న బదాయూ జిల్లా, ఉగైతీ ప్రాంతంలో 50ఏళ్ల మహిళా అంగన్వాడీ కార్యకర్తపై అత్యాచారం జరిగింది. దేవుడి దర్శనం కోసం ఓ ఆలయానికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నిందితులైన ఆలయ పూజారి, అతని ఇద్దరు శిష్యులపై ఉగైతీ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 376-డీ(సామూహిక అత్యాచారం), 302(మర్డర్)కింది కేసు నమోదు చేశారు. ఇదివరకే ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.
కేసీఆర్‌కు హెల్త్ చెకప్, నెక్ట్స్ సీఎం ఆయనేనా?
అఖిలప్రియ అరెస్టు ఏపీలో అయితే… వేరేలా ఉండేది…
విజయసాయిరెడ్డి ముందే కుండబద్దలు కొట్టిన ధర్మాన!
ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి