యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని బెదిరింపులు !

ఉత్తర ప్రదేశ్ సి‌ఎం యోగి అధిత్యనాథ్ ను చంపేస్తామని లక్నో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112 ను మెసేజ్ వచ్చినట్లు లక్నో పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు అప్రమత్తం అయి యూపీ సి‌ఎం కు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఇక ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాట్సప్ ద్వారా ఈ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ని బాంబు ద్వారా చంపేస్తామని ఆ మెసేజ్ లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అయితే ఆ మెసేజ్ ఎవరు చేశారు ? ఎందుకు చేశారు అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే యూపీలో అత్యంత ప్రజాధరణ పొందిన ముఖ్యమంత్రిగా యోగి అధిత్యనాథ్ కు పేరుంది. ఆయన యూపీలో చేపట్టిన చాలా విధానాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉంటాయి.

ఇక బీజేపీ పార్టీ పరంగా కూడా యోగి ఆదిత్యనాథ్ క్రియాశీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా బెదిరింపు మెసేజ్ రావడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎవరో ఆకతాయి చేసిన పని అని కొందరు కొట్టిపారేస్తుంటే.. మరి కొందరు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి యోగి అధిత్యనాథ్ ను చంపేస్తామని వచ్చిన మెసేజ్ దేశ వ్యాప్తంగా సంచలనానికి తెరతీసింది.

Related Articles

Most Populer

Recent Posts