ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

- Advertisement -

కొంత మంది హీరోయిన్లకు తక్కువ సమయంలోనే అదిరిపోయే ఫాలోయింగ్‌ వస్తుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా.. చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు సాయి పల్లవి. ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాచ్యురల్‌ బ్యూటీ… ఆ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. . ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. ఆ తర్వాత నానితో ఏంసీఏలో నటించి మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎన్జీకె’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంత నిరుత్సాహాపడిన ఈ నాచ్యురల్ బ్యూటీ.. మళ్లి పుంజుకుని వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఆమెకు తాజాగా మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. పవన్‌ కల్యాణ్, రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో షురూ అయింది.

- Advertisement -

ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్‌ పాత్రలో పవన్ నటిస్తోండగా.., కొషీ పాత్రను రానా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ ఫిక్స్ అవ్వగా.. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇక పవన్ కి జోడిగా సాయిపల్లవిని పరిశీలిస్తోందట చిత్రబృందం. దీనికి సంబంధించి తాజాగా ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో నటించడానికి సాయిపల్లవి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. సాయి పల్లవి పాత్ర నిడివి సినిమాలో ఎక్కువగా ఉండడంతో.. భారీ మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

ఇక సాయి పల్లవి ఇతర సినిమాల విషయానికి వస్తే.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా విరాటపర్వంలో సాయిపల్లవి హీరో రానా దగ్గుబాటికి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్ లొ కూడా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

నాగచైతన్య సినిమాలో మహేశ్ బాబు..

బండిపై బాల్క ఫైర్‌

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

వెన్న లాంటి పాటలు​ రాసిన​ వెన్నెలకంటి

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...