Thursday, May 16, 2024
- Advertisement -

బ్యాచిల‌ర్‌గా ఉండ‌డం నా విజ‌య‌సూత్రం

- Advertisement -

ప్ర‌స్తుతం రిటైల్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీల‌కు పోటీగా స్వదేశీ నినాదంతో యోగా గురు, ప‌తాంజ‌లి అధినేత రామ్‌దేవ్ బాబా నిలుస్తున్నాడు. వ్యాపార‌వేత్త‌ల‌కు త‌న ఉత్ప‌త్తుల‌తో చుక్క‌లు చూపిస్తూ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని మారుమూల గ్రామానికి తీసుకెళ్తున్న రామ్‌దేవ్ బాబా ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల పుణ్యంతో ప‌తాంజ‌లి సంస్థ‌ను బాగా అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప‌తాంజ‌లి ఔట్‌లెట్లు.. ఏ ఇంట్లో చూసినా ప‌తాంజ‌లి స‌రుకులు, వ‌స్తువులు కనిపిస్తున్నాయి. అయితే ఇంతగా తాను వ్యాపారంలోకి రావ‌డం ఒక విజ‌య సూత్రం ఉంద‌ని చెప్పాడు. త‌న వ్యాపార స‌క్సెస్ బ్యాచిల‌ర్‌గా ఉండ‌డ‌మే అని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పాడు.

సంతోషకరమైన, విజయవంతమైన త‌న‌ జీవితానికి కారణం తాను బ్రాహ్మచారిగా ఉండడ‌మే అని ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో రామ్ దేవ్ బాబా చెప్పారు. లాభం ఆర్జించేందుకు కాకుండా ఈస్టిండియా కంపెనీలా దేశాన్ని లూఠీ చేస్తున్న కంపెనీలకు బుద్ధి చెప్పేందుకే పతంజలిని స్థాపించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. తాను ఆర్జించినదంతా ఆరోగ్యం, విద్య, పేద ప్రజల కోసమే ఖర్చు పెడతా అని ప్ర‌క‌టించారు.

చూశారా బ్యాచిల‌ర్‌గా ఉంటే ఈ విధంగా వ్యాపారంలో రాణించ‌వ‌చ్చ‌ని ఇప్పుడు యువ‌త భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -