దిగ్గజ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తమ కరోనా వ్యాక్సిన్… కొవాగ్జిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ మేరకు సంస్థ సీఎమ్‌డీ కృష్ణ ఎల్లా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 25 సెంటర్లలో 26 వేల మంది వలంటీర్లకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ఇస్తున్నారు. మొత్తం 28 రోజుల్లో 6 మైక్రో గ్రాముల ఇంజక్షన్ లు రెండు సార్లు లేక ప్లాసిబో రెండు డోస్ లను వాలంటీర్ల కు ఇవ్వనున్నారు. దేశంలో అత్యధిక మందిపై నిర్వహిస్తున్న మొట్టమొదటి ఫేజ్ 3 ట్రయల్స్ ఇవే కావటం విశేషం.
కొవాగ్జిన్ మొదటి రెండు దశల ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో మూడో దశ ట్రయల్స్ చేపట్టినట్టు కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటివరకు ఈ టీకా ట్రయల్స్ సంతృప్తికరంగా సాగగా.. తాజా ట్రయల్స్‌లో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఫైజర్.. వచ్చేస్తుంది.. భారీ స్థాయిలో పరీక్షలు..!