టీం ఇండియా నలుగురు క్రికెటర్లకు కరోనా

ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్ తో వన్డే, టి 20 మ్యాచ్ లలో భారత్ తలపడనుంది. ఇప్పటికే టీ ఇండియా, విండీస్ క్రికెటర్లు అహ్మదాబాద్ చేరుకున్నారు. వారంతా బయోబబుల్లోకి వెళ్లారు. మూడు రోజుల పాటు క్రికెటర్లు హోం క్వారంటైన్ లో ఉంటారు.

త్వరలోనే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నలుగురు క్రీడాకారులు కరోనా బారినపడడంలో భారత క్రికెట్ శిబిరంలో కలకలం రేగింది. ఓపెనర్ శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. వీరితోపాటు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ , మరో ఇద్దరు సహాయక సిబ్బందికి కూడా కరోనా సోకింది .

రోజు వారీ రొటీన్ గా నిర్వహించన పరీక్షలోభాగంగా వీరికి పాజిటివ్ గా తేలిందని బీసీసీఐ తెలిపింది. ఫైనల్ గా నిర్వహించే కరోనా పరీక్షల తర్వాత జట్టులో తుదిమార్పును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. రిజర్వు ప్లేయర్లుగా ఉన్న షారుక్ ఖాన్, సాయి కిషోర్, రిషి ధావన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్ బరిలో ఆ రాష్ట్ర మంత్రి కూడా..

సరైన సమయంలో తప్పుకోవడం నాయకత్వ లక్షణం

Related Articles

Most Populer

Recent Posts