Friday, May 3, 2024
- Advertisement -

కరోనా డేంజర్ బెల్.. రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు!

- Advertisement -

చైనాలో పుహాన్ లో పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. లక్షల మంది మృత్యువాత పడ్డారు. లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ కూడా విధించిన విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మాత్రం విజృంభిస్తూనే ఉంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలైందని అంటున్నారు. ఇప్పుడు దీని ప్రభావం మరింతగా చూపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూరప్‌లో చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించాయి.

మరికొన్ని దేశాలు సైతం లాక్ డౌన్ దిశగా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కరోనా తీవ్రత మళ్లీ పెరిగింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 6,57,312 కేసులు నమోదయ్యాయి. అలాగే, 9,797 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.

తాజా మరణాలతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 13,00,576 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం కరోనా తీవ్ర ప్రభావంతో ఉన్న దేశాల్లో అమెరికా ముందుండగా, ఆ తర్వాతి స్థానాల్లో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యాలు ఉన్నాయి.

స్పేస్​ ఎక్స్ వాయిదా..!

ఆ వ్యక్తి తలపై 10 మిలియన్ల రివార్డు..!

ట్రంప్ 232.. డెమొక్రాట్ కి 306.. నయా లెక్కలు..!

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -