Friday, May 17, 2024
- Advertisement -

దివికెగిసిన మేరునగధీరుడు వాజ్‌పేయి….

- Advertisement -

భారత మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజపేయి తుదిశ్వాస విడిచారు. యావత్ భారతదేశాన్ని దు:ఖసాగరంలో ముంచేస్తూ గురువారం (ఆగస్టు 16) సాయంత్రం 5.05 గంటలకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వాజపేయి మరణవార్తతో యావత్ దేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. గ‌త కొద్దిరోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న అట‌ల్ నిష్క్ర‌మించారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త‌ల‌ను వైద్యులు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆసుపత్రిలో దాదాపు తొమ్మిది వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు.

వాజపేయి వయసు 93 సంవత్సరాలు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న వాజపేయి… నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని, పెంచారు. వాజపేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు, వాజపేయి నివాసం వద్దకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేరుకున్నారు.

ఆయన మృతితో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించడంతో జూన్ 11న ఆయణ్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందారు. బుధవారం రాత్రి వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడంతో ఆయణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. గురువారం ఆరోగ్యం మరింతగా విషమించడంతో ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -