Sunday, May 19, 2024
- Advertisement -

బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీనీ ఓడించేలా ఉంది!

- Advertisement -

కేంద్రంలో మోడీ సర్కారు అంటే..దానిపై భారీ అంచనాలే ఉండేవి. ఎన్నికల ముందు నుంచినే మోడీ సర్కారు ఏర్పడటం ఖాయం అని నమ్మిన వాళ్లు భారీ అంచనాలు పెట్టుకొని ఉండేవారు.

మోడీ వస్తే అన్నీ మారిపోతాయని వారు ఎక్స్ పెక్ట్ చేశారు. అద్భుతాలు జరుగుతాయని..  మన్మోహన్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు పై ఉన్న వ్యతిరేకత కూడా మోడీ పై మరిన్ని అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. మరి ఏదో జరుగుతుంది అనుకొంటే.. ఏమీ జరగకుండానే కాలం గడిచిపోతోంది.

ఇప్పటి వరకూ మోడీ సర్కారు సాధించింది ఏమీ లేదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. మరి ఇప్పటి వరకూ ఒక ఎత్తు అయితే.. ప్రత్యేక హోదా అంశంలో ఏపీకి మరో షాక్ తగిలింది. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజల్లో ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కుతుంది.. ఇక్కడికి కొత్త ప్రాజెక్టులు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. విభజనతో అన్యాయం అయిపోయిన రాష్ట్రానికి ఈ విధంగానైనా  న్యాయం జరుగుతందని వారు ఆశించారు.

అయితే ఇప్పుడు అది అసాధ్యం అని తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ను కల్పించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని తెలుస్తోంది. మరి ఇప్పుడు బీజేపీపై ఏపీలో తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతోంది.  తాము అధికారంలోకి వస్తే… ఏపీకి ఏళ్లకు ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ వాళ్లు ఇలా మోసం చేస్తుండే  సరికి ప్రజల్లో కమలం పై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఇక మరోవైపు తెలుగుదేశం వాళ్లు ఇప్పటికీ బీజేపీని వెనకేసుకు వస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పలేదని వారు అంటున్నారు. ఇలాంటి తీరును చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో భారతీయజనతా పార్టీ, తెలుగుదేశంలు ఉమ్మడిగా మునగడం ఖాయమేనేమో అనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -