Friday, May 17, 2024
- Advertisement -

ప్రకటించడమే లేటు: సత్తి బాబు ఇక జగన్ దారిలోనే!

- Advertisement -

పీసీసీమాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ భవిష్యత్తు కార్యాచరణ గురించి పూర్తి క్లారిటీ వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ ని ఖాళీ చేయడం దాదాపు ఖాయమైంది. వైకాపాలో చేరడం కూడా ఖాయమైనట్లే.

గత కొన్ని రోజులుగా సత్తిబాబు వైకాపాలో చేరిక గురించి వార్తలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో ఉండటం వల్ల ప్రయోజనంలేదని గ్రహించిన ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైకాపాలో చేరనున్నట్టుగా ఊహాగానాలు చెలరేగాయి.

సత్తిబాబు వైకాపాలో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ సీటు కూడా ఖాయమైనట్టుగా తెలుస్తోంది. అయితే సత్తిబాబు వైకాపాలో చేరడాన్ని విజయనగరం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు వ్యతిరేకించారు. వైకాపాలో ఆదినుంచి పనిచేస్తున్న సుజయ్ కృష్ణరావు తదితరులు సత్తిబాబు చేరికను వ్యతిరేకించారు.

గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సత్తిబాబు తో శత్రుత్వాన్ని కలిగిన నేతలంతా ఇప్పుడు వైకాపాలో ఉన్నారు. అప్పట్లో సత్తిబాబు ధాటిని తట్టుకోలేక వీళ్లంతా వైకాపాలో చేరారు. ఈ నేపథ్యంలో వీళ్లు గత గొడవలను సృష్టిలో ఉంచుకొని అధినేత జగన్ మోహన్ రెడ్డికి అభ్యంతరాలు తెలియ జేశారు. ఇలాంటి పరిణామాల మధ్య సత్తిబాబు వైకాపాలో చేరడం గురించి ప్రతిష్టంభననెలకొంది. 

అయితే శనివారం పరిణామాలు మాత్రం సత్తిబాబు వైకాపాలో చేరడం ఖాయపరిచాయి. సత్తిబాబు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లపై విరుచుకుపడ్డాడు. ఆ రెండు పార్టీలూ తమ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసమే చూసుకొంటున్నాయని తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు.. ప్రత్యేక హోదా అంశం గురించి సరిగాస్పందించడం లేదని సత్తిబాబు విమర్శించాడు.

మరి ఇలా సత్తిబాబు బీజేపీ, టీడీపీలను విమర్శించడం ఆయన వైకాపాలోచేరబోతున్నాడనేదానికి రుజువుగా చెప్పవచ్చు. ఇది సత్తిబాబు కాంగ్రెస్ కు దూరం అవుతున్నడనేదానికి సాక్ష్యంగా చెప్పవచ్చు. మరి ఇక అధికారిక ప్రకటనే లేటనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -