Thursday, May 16, 2024
- Advertisement -

స‌న్న‌, చిన్న కారురైతుల‌కు మోదీ రైతు బంధు ప్ర‌తీ ఏడాది రూ.6000 పెట్టుబ‌డిసాయం…

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధును కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. స‌న్న‌, చిన్న‌కారు రైతుల‌కు ఆదుకొనేందుకు కేంద్రం కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఐదు ఎక‌రాలోపు ఉన్న రైతుల‌కు పెట్టుబ‌డిసాయం కింద ప్ర‌తీ ఏడాది మూడు విడ‌త‌ల్లో రూ.6000 నేరుగా రైత‌లు బ్యాంక్ ఖాతాల్లోకి జ‌మ అవుతుంద‌ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌తీ ఏడాది 12 కోట్ల మంది రైతుల‌కు ల‌బ్దిచేకూరుతుంద‌న్నారు.రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మూడు విడుతల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -