Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్‌పై కేంద్రమంత్రి కామెంట్

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాశానికెత్తేశారు. దేశంలోనే అతి పెద్ద సినిమా అని కొనియాడారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల ట్రిపుల్ ఆర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, రాంచరణ్, ఎన్టీఆర్‌ల అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

మన్యం వీరులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలకు ఫిక్షన్ జోడించి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై రాజమౌళి అద్భుతంగా చూపించారు. ఈ సినిమా త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరబోతోందని సినీ ప్రముఖులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ ట్రిపుల్ ఆర్‌పై స్పందించారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా మాదిరిగానే.. భారత ఆర్ధిక వ్యవస్థ కూడా మోదీ నాయకత్వంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యలకు ఆర్.ఆర్.ఆర్ టీం ధన్యవాదాలు తెలిపింది. దేశ అభివృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని ఆర్.ఆర్.ఆర్ టీం ట్వీట్ చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

రాజకీయాల్లోకి యంగ్ టైగర్ వస్తున్నారా ?

భారీగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన కృతి శెట్టి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -