Saturday, April 20, 2024
- Advertisement -

రాజ్యసభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీజేపీ

- Advertisement -

రాజ్యసభ అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. త్వరలో 9 రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, మహారాష్ట్ర నుంచి పీయూ‌ష్​ గోయల్‌ను ఎంపిక చేసింది.

ప్రస్తుతం వీరు అవే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలో వీరు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలు జూన్​ 10న జరగనున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌ నుంచి సుశ్రి కవితా పటిదార్‌, కర్ణాటక నుంచి జగ్గేష్‌, మహారాష్ట్ర నుంచి అనిల్‌ సుఖ్‌దేవ్‌రావ్‌ బొండే, రాజస్థాన్‌ నుంచి ఘన్‌శ్యామ్​ తివారీ, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి లక్ష్మీకాంత్‌ వాజ్‌పేయీ, రాధామోహన్‌ అగర్వాల్‌, సురేంద్రసింగ్‌ నగర్‌, బాబురామ్‌ నిషద్‌, దర్శన సింగ్‌, సంగీత యాదవ్‌కు అవకాశం కల్పించింది.

ఉత్తరాఖండ్‌ నుంచి , కల్పనా సైనా, బిహార్‌ నుంచి సతీష్‌ చంద్రదూబే, హరియాణా నుంచి కిషన్‌ లాల్‌ పన్వార్‌ను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.

బాలకృష్ణపై రోజా సంచలన వ్యాఖ్యలు

జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్

బండి సంజయ్‌పై ఫిర్యాదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -