Sunday, May 19, 2024
- Advertisement -

బ‌డ్జెట్‌లో ర‌క్ష‌ణ రంగానికి తొలిసారిగా రూ.3 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు

- Advertisement -

2019-20 సంవ‌త్స‌రానికి సంబంధించిన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో తొలిసారిగా ర‌క్ష‌ణ రంగాణికి నిధుల కేటాయింపును పెంచింది కేంద్రం. చైనా, పాక్ నుంచి ముప్పు పొంచి ఉంద‌ని కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ అన్నారు. సైన్యాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 2018-19 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2.95 లక్షల కోట్లను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం రూ.3ల‌క్ష‌ల కోట్ల నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

దేశ రక్షణకు అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్‌ మ్యాన్‌ వన్‌ పెన్షన్‌‌ను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. దీనికోసం రూ. 35వేల కోట్ల‌రూపాయ‌లు ఖ‌ర్చు అవుతోంద‌న్నారు. నేటి ఉదయం 11 గంటలకు పీయూష్ గోయల్ లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినసంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -