Tuesday, May 21, 2024
- Advertisement -

ఎన్నికల బరిలో ఉండకూడదని టిడిపి నిర్ణయం..?

- Advertisement -

ఖమ్మం జల్లా పాలేరు ఉప ఎన్నికల్లో రసవత్తర పోరుకు తెరలేవనుంది. ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమతి అభ్యర్ధిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితా రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇక తెలుగుదేశం, వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేయరాదని ఆ పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. ఉపఎన్నిక జరిగిన నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పోటీ చేయకుండా దివంగత ఎమ్మెల్యే కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా నిలపాలని ప్రధాన పార్టీలు కోరుతున్నాయి. గతంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారని, దానికి టిఆర్ఎస్ తూట్లు పొడిచి ఎన్నికల్లో పోటీ చేస్తోందని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

అయితే పాలేరు ఉపఎన్నిక విషయంలో మాత్రం తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిడిపి, వైఎస్ఆర్ సిపిలను కోరారు. దీనికి ఆ రెండు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో పార్టీ సిపిఎం మాత్రం తమ అభ్యర్ధిని ప్రకటించామని, బరిలో ఉండక తప్పదని తేల్చేసింది. దీంతో పాలేరు అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎంల మధ్యే పోటీ నెలకొననుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -