Sunday, May 19, 2024
- Advertisement -

ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం

- Advertisement -

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అతి పెద్ద జాతీయ బ్యాంక్. ప్రయివేట్ బ్యాంకుల నుంచి వచ్చే పోటీని తట్టుకుని నిలబడిన బ్యాంక్ ఎస్ బిఐ. ఇప్పుడు ఈ బ్యాంక్ ఓ మహాబ్యాంక్ గా అవతరించబోతోంది. ఈ బ్యాంక్ కు చెందిన ఐదు అనుబంధ బ్యాంకులను ఎస్ బిఐలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రి మండలి అంగీకరించింది.

ఇది దేశ బ్యాంకింగ్ రంగంలో ఓ అద్భుతం. ఈ విలీనం పూర్తి అయితే ఎస్ బిఐ ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా మారుతుంది. ఎస్ బిఐలో విలీనమవుతున్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ బ్యాంకులున్నాయి.

ఇటీవలే ప్రారంభించిన భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకునేందుకు ఎస్ బిఐకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇది బ్యాంకింగ్ రంగంలో భారీ కన్సాలిడేషన్ కు నాంది పలికినట్లుగా అయ్యింది. బ్యాంకుల విలీనాన్ని ఎస్ బిఐ గతంలోనే కేంద్రం ముందు ఉంచింది. అయితే ఆయా బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. విలీనం వల్ల అటు ఎస్ బిఐకి, ఇటు విలీనమైన బ్యాంకులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఎస్ బిఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య అన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద 50 బ్యాంకులలో భారతీయ బ్యాంకు ఒక్కటి కూడా లేదని, ఈ విలీనంతో ఆ లోటు భర్తీ అవుతుందని ఆమె చెప్పారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -