Friday, May 17, 2024
- Advertisement -

అక్ర‌మాస్తుల‌కేసు కేసులో అఖిలేష్, ములాయంలకు ఊరట

- Advertisement -

అక్రమాస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌కు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు భారీ ఊరట లభించింది. రెండు రోజుల్లో ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌ధ్యంలో ఊర‌ట ల‌భించ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం.

అక్రమాస్తుల కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ… తండ్రీకొడుకులిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది.అఖిలేష్‌, ములాయంల మీద రెగ్యూలర్‌ కేసు నమోదు చేసేందుకు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ, సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ములాయం సింగ్‌ అధికారంలో ఉన్న రోజుల్లో వారి ఆస్తులు అనూహ్యంగా పెరగాయంటూ గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోప‌న‌ల‌పై విశ్వనాథ్‌ చతుర్వేదీ అనే వ్యక్తి 2005లో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌, కోడలు డింపుల్‌ యాదవ్‌లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

ఈ కేసులో సీబీఐ ఇంత వరకూ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవటంతో విశ్వనాథ్‌ మరోసారి సుప్రీ కోర్టును ఆశ్రయించారు.ఈ ఏడాది మార్చిలో మరోసారి విచారణ చేపట్టిన కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ములాయం, అఖిలేష్‌ల కేసు దర్యాప్తు ఎంత వరకూ వచ్చిందో తెలుపుతూ.. రెండు వారాల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది.

ప్రాథమిక విచారణ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని… అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అఫిడవిట్ లో తెలిపింది. కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు కూడా ఎన్నడూ ఆదేశించలేదని తెలిపింది. 2013 ఆగస్టు తర్వాత కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరపలేదని వెల్లడించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -