- Advertisement -

తణుకులో గెలిచేది ఎవరో?

- Advertisement -

ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట..కానీ ఇప్పుడు వైసీపీ ఖాతాలోకి చేరింది. అదే తణుకు నియోజకవర్గం. ఇక్కడి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కారుమూరి నాగేశ్వరరావు. తొలి సారి కాంగ్రెస్ నుండి 2009లో గెలిచిన కారుమూరి తర్వాత 2019లో గెలిచి మంత్రిగా ఉన్నారు. ఓ వైపు మంత్రిగా మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే మరోసారి తన గెలుపుకు దోహదం చేస్తుందని ధీమాగా ఉన్నారు కారుమూరి.

ఇక కూటమి తరపున బరిలో నిలిచారు మాజీఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ కావటంతో తన వంతు పాత్రను పోషించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తనను గట్టెక్కిస్తుందని చెబుతున్నారు. టీడీపీలో మొదటి నుండి పనిచేశారు రాధాకృష్ణ. 2019లో జనసేన – టీడీపీ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయానని ఈసారి గెలుపు తనదేనంటున్నారు.

ఈ నేపథ్యంలో తణుకులో గెలిచేది ఎవరనే దానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ప్రధానంగా వైసీపీ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్ కాస్తుండగా తణుకు ఓటర్లు ఎవరికి జై కొట్టారో మరో ఐదు రోజుల్లో తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -