Wednesday, May 15, 2024
- Advertisement -

జపాన్ నుంచి వస్తున్న బాబుకు ఇంత చెత్త స్వాగతమా!

- Advertisement -

తెలుగుదేశం అధినేత  చంద్రబాబు తన ఏడాది పాలనలో ఏదైనా హైప్ క్రియేట్ చేయగలిగాడు. .అంటే అది విదేశీ పర్యటనలతో మాత్రమే! వరస విదేశీ పర్యటనలు చేపడుతూ.. తన మందీ మార్బలంతో అక్కడికి వెళుతూ.. పెద్ద పెద్ద వాళ్లతో సమావేశాలు అవుతున్నామని ప్రకటిస్తూ…

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెస్తున్నామన్న ప్రచారంతో తెలుగుదేశం అధినేత బండి లాక్కొస్తున్నాడు. ఒకవైపు ఇలాంటి విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయనే విమర్శలు వస్తున్నా.. బాబు వాటికి జడియక పర్యటనల మీద పర్యటనలు చేపడుతున్నారు.

మరి ఇలాంటి పరంపరలో తాజాగా ఆయన జపాన్ వెళ్లారు. అక్కడ.. ఆ దేశ ప్రధానితో సహా అనేక మందితో సమావేశం అయ్యాడు ఏపీ ముఖ్యమంత్రి.  ఏపీ నూతన రాజధాని నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జపాన్ ప్రధానిని ఆహ్వానించాడట తెలుగుదేశాధినేత.అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా అక్కడి పెట్టుబడి దారులను ఆహ్వానించాడట. మరి బాబుగారు అక్కడ అంత హడావుడి చేస్తున్నా.. అందుకు సంబంధించి ఏపీలో మాత్రం సందడి లేదు!

ఇక్కడ వేరే రచ్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్లే.. ఇలాంటి రచ్చలకు కారణం అవుతున్నారు. జపాన్ నుంచి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన చర్చలు జరగకుండా.. చేసింది తెలుగుదేశం వాళ్లే. తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్ పై దాడి చేయడంతో.. ఇప్పుడు మీడియాలో అది చర్చనీయాంశం గా మారింది. ఒక ఎమ్మెల్యే ఈ విధంగా రౌడీయిజం చేయడం ఏమిటి? అనే అంశంపై అందరి దృష్టీ పడింది. దీంతో బాబు జపాన్ పర్యటనపై చర్చకన్నా.. తెలుగుదేశం ఎమ్మెల్యే రౌడీయిజం మీదనే ఎక్కువ చర్చ జరుగుతోంది. దీంతో బాబు విదేశీ పర్యటన ఫలం దక్కకుండా పోయినట్టుగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -