Wednesday, May 22, 2024
- Advertisement -

వైద్య, ఆరోగ్యశాఖకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు!

- Advertisement -

తెలంగాణలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 7,432 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,157 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,87,106కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,26,997 మంది కోలుకున్నారు.

మృతుల సంఖ్య 1,961గా ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ ని అమలు చేసింది. తాజాగా సిఎం కెసిఆర్ వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకోవాలని ఆదేశించారు.

గాంధీ, టిమ్స్ లాంటి పేషంట్లు ఎక్కువగా ఆస్పత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా చికిత్స చేయించుకోవాలన్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందివ్వాలన్నారు.

డ్రైవర్ గా మారిన హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్!

తెలంగాణలోని అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ

మాల్దీవుల్లో రెచ్చిపోయిన మలమాళీ ముద్దుగుమ్మ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -