Friday, May 17, 2024
- Advertisement -

కేసీఆర్ కు కార్పొరేట్లు కంపెనీలు షాక్ ఇచ్చాయా?!

- Advertisement -

ఈ మధ్య మన రాజకీయ నేతలు తమ ఇమేజ్ ను కార్పొరేట్ కంపెనీల ద్వారా పెంచుకొనే యత్నాలు చేస్తున్నారు.

తమకు కార్పొరేట్ కంపెనీలు మంచి గౌరవానిస్తున్నాయని.. చెప్పుకోవడం. వారి చేత గౌరవమర్యాదలు పొందడం రాజకీయ నేతలకు గ్లామరస్ పాయింట్ అవుతోంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా కంపెనీలు పెట్టే పెట్టుబడులను కూడా రాజకీయ నేతలు తమ ఇమేజ్ ను పెంచుకోవడానికి ఉపయోగించుకొంటున్నారు. ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ ల మధ్య ఈ పోటీ ఇంకా ఎక్కువగా ఉంది!

కార్పొరేట్లు తమకు విలువనిస్తున్నాయని.. తాము చెప్పినట్టుగా పెట్టుబడులు పెడుతూ, ఖర్చు చేస్తున్నాయని వీరు తమ తమ అనుకూల మీడియాల ద్వారా ప్రచారం చేయించుకొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టాటా  కంపెనీ ఒకింత షాక్ నే ఇచ్చినట్టుంది. 

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కు కార్పొరేట్ కంపెనీల నుంచి గొప్ప సహకారం లభించబోతోందని మొదటప్రచారం చేశారు. దీనికి ఆ కంపెనీలు భారీ ఎత్తున డబ్బును సాయంగా ఇస్తాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇలా అందరి సహకారం ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు టాటా కంపెనీ వారు కేవలం పదిక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకొన్నారు.

ఈ డబ్బును అందుకోవడానికి కూడా అమెరికా వరకూ వెళ్లి రావాల్సి ఉంటుందట! టాటా కంపెనీ ఇండియాదే అయినా.. ఈ దాతృత్వపు సొమ్ము మాత్రం అక్కడ నుంచి ఇస్తారట.మరి మిషన్ కాకతీయ వంటి ప్రోగ్రామ్ కు ఈ పదిలక్షల రూపాయలు ఏ మూలకూ సరిపోతాయో వేరే చెప్పనక్కర్లేదు. కార్పొరేట్లు సాయం చేస్తాయని అంటే..దాన్ని భారీగా ఊహించుకొంటే.. వాళ్లు ఇలాంటి చాలా చిన్న మొత్తాలను విరాళంగా ప్రకటించి షాకులిస్తున్నారు. 

ఇక యాదగిరి గుట్ట అభివృద్దికి కూడా కార్పొరేట్లు భారీ స్థాయిలో నిధులిస్తారని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. గుట్ట అభివృద్ధి కి అంతా రిలయన్స్ వంటి సంస్థలే డబ్బు పెడతాయని ఆయన ప్రకటించారు. మరి ఆ వ్యవహారంలో కార్పొరేట్ కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -