Monday, April 29, 2024
- Advertisement -

బీఆర్ఎస్ కాదు మళ్లీ టీఆర్ఎసే!

- Advertisement -

గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు కేసీఆర్. అయితే గత ఎన్నికల్లో తెలంగాణలో ఓటమి పాలు కావడంతో జాతీయ రాజకీయాల సంగతి పక్కనపెట్టి సొంతరాష్ట్రంలో పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడంపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.బీఆర్ఎస్ పేరు కలిసి రాలేదని.. పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని నాయకులు డిమాండ్ చేస్తున్న సందర్భంలో పార్టీ పేరు మార్పు వ్యవహారం న్యాయపరంగా అధిగమించే అంశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

27న పార్టీ పేరు మార్పుపై ప్రకటన చేయనున్నారు కేసీఆర్. దీంతో గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యాయ పరంగా ఎలాంటి చిక్కులు ఉంటాయి అన్న దానిపై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారట కేసీఆర్. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారుతుందా లేదా అన్న సస్పెన్స్‌కు తెరపడాలంటే 27 వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -