Tuesday, May 21, 2024
- Advertisement -

సుప్రీంలో నేర నాయకులు..!

- Advertisement -

న్యాయస్థానాల్లో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల ఎన్నికను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ అంశం పూర్తిగా శాసన సంబంధ వ్యవహారమని, అది పార్లమెంటు పరిధిలోకి వస్తుందని పేర్కొంది.

ఐదు లేదా అంత కన్నా ఎక్కువ సంవత్సరాల కారాగార శిక్ష పడే ఆస్కారమున్న నేరాలకు సంబంధించి, అభియోగ పత్రాల్లో ఏడాది కన్నా ఎక్కువ కాలం పాటు పేరున్న ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికను రద్దు చేయాలంటూ ‘లోక్​ పహారి’ ఎన్జీవో ప్రతినిధి ఎస్‌ఎన్‌ శుక్లా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌-100ను అనుసరించి అభియోగాలు ఎదుర్కొంటున్న చట్టసభ్యుల ఎన్నికను రద్దు చేయొచ్చంటూ పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ సెక్షన్‌లో పేర్కొన్న నిబంధనలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించినవని, దీనిపై పార్లమెంటే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -