Monday, May 20, 2024
- Advertisement -

పార్లమెంట్ లో మనకి ‘ఛాన్స్’ ఇస్తారా ?

- Advertisement -

పార్లమెంట్ సమావేశాలకి అంతా సిద్దమైంది, ఇవాళ  నుంచే సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్ సభ, రాజ్య సభల్లో బిల్లుల గందరగోళం ఎలాగూ ఉంది. దేశం మొత్తం పార్లమెంటు సమావేశాల కోసమని ఎదురు చూడాలి కానీ జనాలు మాత్రం పార్లమెంటు అక్కడి సమావేశాలు అంటే చిరాకు గా ఉన్నారు.

పార్లమెంటు సజావుగా సాగేది ఎప్పుడు అనే అసహనం జనాల్లో బాగా పెరిగిపోయింది. అది ఒకరకమైన జుగుప్స కి దారి తీస్తోంది. ‘ అసహనం ‘ మీద (జనాల అసహనం మీద కాదు మత అసహనం మీద) పార్లమెంట్ లు పెద్ద చిచ్చు లేవబోతోంది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అసహనం వంకతో అధికార పార్టీ ని ఇరకున పెట్టడం అనేది ప్రాధమిక ఉద్దేశ్యంగా  కాంగ్రెస్‌ సహా, ఇతర విపక్షాలు తమదైన వ్యూహాల్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి.

అసహనం పేరుతో కాంగ్రెస్‌ హడావిడి చేస్తే, రాహుల్‌గాంధీ స్థానికత, పౌరసత్వం గురించిన వివాదాన్ని తెరపైకి తీసుకురావాలని అధికారంలో వున్న బీజేపీ భావిస్తోంది.ఎప్పటి లాగానే ఎదో ఒక వివాదాస్పద అంశాన్ని లేవనెత్తి దాని మీద కొట్టుకుని ప్రజల డబ్బునీ, పార్లమెంట్ విలువైన సమయాన్నీ వృధా చెయ్యడం తప్ప ప్రజలకి ఒరిగే పని ఒక్కటీ చెయ్యరు అని ఇప్పుడే జనాలు ఫిక్స్ అయిపోయారు.

తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ ని వేదికచేసుకోవాలని చాలామంది చూస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఏపీ నుంచి వైకాపా చాలా పెద్ద ప్లాన్ లలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంతో పాటు టీడీపీ ఎంపీలు కూడా హడావిడి చేసేలగానే కనిపిస్తున్నారు అయితే ఎటొచ్చీ మనవాళ్ళకి అసలు అవకాసం దొరుకుతుందా లేదా అనేది ఉదయిస్తున్న ప్రశ్న. అనవసర రగడలతో గడిపేసే వారు ఇప్పుడు ఏపీ ఎంపీలకి తగిన సమయం ఇస్తారా ఇవ్వరా అనేది చాలా పెద్ద చర్చనీయాంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -