Tuesday, May 21, 2024
- Advertisement -

బేయిల్ పిటీష‌న్‌ను కోట్టేసిన కోర్టు…ఈనెల 12 వ‌ర‌కు రిమాండ్‌….

- Advertisement -

యువతిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గాయకుడు, గజల్ కళాకారుడు శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్‌ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మంగళవారం పోలీసులు ఆయ‌న‌ను నాంప‌ల్లి న్యాయస్థానంలో ప్ర‌వేశ‌పెట్టారు. కోర్టు ఈ నెల 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై వాద‌న‌లు కొన‌సాగాయి. చివ‌ర‌కు కోర్టు బెయిల్ పిటిష‌న్‌ను కొట్టివేసింది. దీంతో పోలీసులు గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకి త‌ర‌లించారు. ఆ కేసులో బాధిత యువ‌తి స‌మ‌ర్పించిన ఆధారాల‌నే కాకుండా మ‌రిన్ని ఆధారాలను సేక‌రించ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

లైంగిక వేధింపుల ఆరోపణలతో గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అతను వేధించారని ఓ మహిళ డిసెంబర్ 29వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

బాధితురాలు రేడియో జాకీగా పని చేస్తున్నారు. వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న మహిళను గజల్ శ్రీనివాస్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, ఇటీవల అవి ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారని అంటున్నారు. గజల్‌ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు చెప్పారు. గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం, గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -