టీవీ యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 ఏళ్లు రద్దు చేయడంతో పాటూ రూ. 2100 జరిమానా విధిస్తూ కోర్టు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్ తండ్రితో కలిసి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు.
డ్రంక్ డ్రైవ్ చేయకూడదని ఇదివరకు ప్రచారం కూడా చేశావు, అలాంటిది తెలిసి ఎలా తప్పు చేశారని ప్రదీప్‌ను కోర్టు ప్రశ్నించింది. తప్పు జరిగిపోయింది అని ప్రదీప్ అంగీకరించారు.ఆరోజు డ్రైవర్ లేనందున నేనే కారు డ్రైవ్ చేశాను’ అని ప్రదీప్ సమాధానం చెప్పారట.
గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రదీప్ పరిమితి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో ఈ నెల 8న తన తండ్రితో కలసి గోషామహల్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరయ్యాడు. ఈ రోజు కోర్టుకు హాజరయిన ప్రదీప్‌కు జైలు శిక్ష విధించకుండా డ్రైవింగ్‌లైసెన్స్‌ను రద్దు చేయడంతోపాటు రూ.2100 జరిమానా విధించింది.
