Sunday, May 19, 2024
- Advertisement -

డాలర్ నేలచూపులు.. రూపాయి ముందుచూపు

- Advertisement -

బులియన్ మార్కెట్ పరుగులు తీస్తోంది. ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించడంతో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. బుధవారం నాడు నష్టాల్లో ఉన్న బంగారం ధరలు గురువారం మధ్యాహ్నానికి 500 రూపాయలకు లాభపడింది. దీంతో 30, 970 రూపాయలతో ట్రేడయిన బంగారం 31 వేల మార్కుకు చేరుకుంది.

ఇక అమెరికా డాలర్ తో పోలిస్తూ భారత కరెన్సీ రెండు పైసలు బలపడింది. ఇతర దేశాల కరెన్సీ కంటే అమెరికన్ డాలర్ బలహీనపడింది. దీంతో మన రూపాయి బలపడుతోంది. దేశంలో ఆర్ధికాభివ్రద్ధి కొనసాగుతోందని, ఉద్యోగాల వ్రద్ధి మాత్రం తక్కువగానే ఉందని ఫెడ్ అభిప్రాయపడింది. ఇందుకోసమే వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా స్ధిరంగా ఉంచామని పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు ఇలాగే కొనసాగితే ముందు ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -