Sunday, May 5, 2024
- Advertisement -

మళ్లీ భయపెడుతున్న పసిడి!

- Advertisement -

దేశంలో మరోసారి బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధరతో పాటు వెండి రేటు కూడా పైపైకి వెళ్తుంది. 5 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరుగుతుంది. హైదరాబాద్ మార్కెట్‌లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 పైకి కదిలింది.

దీంతో రేటు రూ.48,070కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 పైకి కదిలింది. దీంతో ధర రూ.44,060కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 1815 డాలర్లకు పెరిగింది.

కేజీ వెండి ధర రూ.800 పరుగులు పెట్టింది. దీంతో రేటు రూ.73,400కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయ్యాయి.. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు గత ఏడాది నుంచి పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -