Sunday, April 28, 2024
- Advertisement -

రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు!

- Advertisement -

గత కొంత కాలంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం తెలిసిందే. రఘురామకృష్ణరాజు కొంత కాలంగా అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా మారారు ఈ రోజు హైదరాబాదులోని రఘురామకృష్ణరాజు నివాసానికి ఏపీసీఐడీ అధికారులు వెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారు. సివిల్ డ్రెస్‌లో వచ్చిన సీఐడీ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి తీసుకని వెళ్లారు.

కాగా, గత కొంత కాలంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనను బలవంతంగా రఘురామ రాజును తీసుకెళ్లారు ఏపీ సీఐడీ పోలీసులు. రఘురామకృష్ణరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

అంతే కాదు జగన్‌పై అసభ్య పదజాలంతో ఇటీవల సోషల్ మీడియాలో మాట్లాడారని ఈమేరకు కేసులు నమోదైనట్లుగా కూడా చెబుతున్నారు. అయితే, రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ఇదిలా ఉంటే.. ఈరోజు రఘురామకృష్ణరాజు పుట్టినరోజు కాగా ఇంట్లోనే ఉన్నారు. ఇటీవలే జగన్ బెయిల్ రద్దు చెయ్యాలంటూ రాజు సీబీఐ కోర్టులో పిటీషన్ కూడా వేశారు.

తన శరీరాకృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక చోప్రా

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు కదిలిన సినీ తారలు..

ముస్లిం సోదర సోదరీమణులకు బాలయ్య శుభాకాంక్షలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -