Friday, May 17, 2024
- Advertisement -

తెలంగాణా ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్‌…అంద‌రికీ నోటీసులు

- Advertisement -

టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు పిటిషన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులోచుక్కెదురైంది. శాసనసభ స్పీకర్‌ మధుసూదనా చారికి హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లను కేటాయించని కారణంగా తెలంగాణ డీజీపీ, జోగులాంబ ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు ఫారం-01 నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది.

నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు అసెంబ్లీ కార్యదర్శిపై ఈ ఏడాది జూన్ 12వ, తేదీన కోర్టు ధిక్కార కేసును హైకోర్టులో దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ కూడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ ను కొట్టేసింది.

ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును కోర్టు తప్పు బట్టింది. తక్షణమే వీరద్దరూ కూడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రకటించింది. ఈ తీర్పును అమలు చేయలేదు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చింది.

ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల జీతభత్యాల వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -