Thursday, May 16, 2024
- Advertisement -

అసెంబ్లీ ర‌ద్దుపై హైకోర్టులో తెలంగాణా ప్ర‌భుత్వానికి ఊర‌ట‌

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ నేత డీకే అరుణ, మరో వ్యక్తి శశాంక్ రెడ్డి వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేబినేట్ తీసుకున్న నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని కోర్టు పిటిష‌న్ల‌ను కొట్టి వేసింది. గ‌త నెల 6న తెలంగాణా ప్ర‌భుత్వం ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కొద్ది రోజుల క్రితం డీకే అరుణ, శశాంక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీని రద్దు చేయడానికి ముందు సభను సమావేశపరచలేదని, అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లిందని, కేబినెట్ కూడా సమగ్రంగా చర్చించకుండా కేవలం కొన్ని నిమిషాల్లోనే నిర్ణయం తీసుకుందని పిటిషన్లో ఆరోపించారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 31న విచారణ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -