Saturday, April 27, 2024
- Advertisement -

బీజేపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు..అసలు ఊహించలేదా?

- Advertisement -

ఇటీవల తెలంగాణలో జరిగిన మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మొయినాబాద్ ఫామ్ హస్ లో చోటు చేసుకున్నా పరిణామాలు ఎంతటి సంచలనానికి దారి తీశాయో అందరికీ తెలిసిందే. టి‌ఆర్‌ఎస్ కు సంబంధించిన నలుగురి ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిందని అందుకు సంబంధించిన ఆడియోలనూ, వీడియోలను సైతం బయటపెట్టి బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు కే‌సి‌ఆర్. అయితే అదంతా కే‌సి‌ఆర్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ నేతలు కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్దగా ప్రయేజనమేమీ కనిపించలేదు. ఇక మునుగోడు ఎన్నికల్లో కు బీజేపీ కి షాక్ ఇస్తూ ఆ నియోజిక వర్గ ఓటర్లు టి‌ఆర్‌ఎస్ కే పట్టం కట్టారు.

అయితే ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్నా పరిణామాలతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని ప్రొజెక్ట్ చేయడంలో కే‌సి‌ఆర్ సక్సస్ అయ్యారు. దీంతో ప్రజల్లో బీజేపీ పై కొంత అసంఘటిత భావన ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఆ ఫామ్ కేసు అంతా కే‌సి‌ఆర్ డైరెక్షన్ లో జరిగిందని, ఆ కేసు సిబిఐ కి అప్పగించాలని అప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ నడిచింది. అయితే తాజాగా ఈ వ్యవహారం పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీ కంగుతినిందనే చెప్పాలి.

ఈ కేసు నూ సిబిఐ కి అప్పగించే ప్రసక్తే లేదని, సీట్ ఆద్వర్యంలోనే దర్యాప్తు కొనసాగాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే బీజేపీ ఆశించినట్లుగా సిబిఐ కి కేసు బదలి అయి ఉంటే.. కచ్చితంగా ఈ కేసు నీరుగానే అవకాశం ఉంది. ప్రస్తుతం సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. కానీ బీజేపీకి షాక్ ఇస్తూ హైకోర్టు ఈ కేసు నూ సిబిఐ బదలికి నిరాకరించడంతో బీజేపీ చిక్కుల్లో పడే అవకాశం ఉండని విశ్లేషకులు చెబుతున్నారు. మరి సిట్ ఆద్వర్యంలో ఈ ఫామ్ హౌస్ కేసులో మున్ముందు ఎలాంటి సంచలన పరిణామాలు తెరపైకి వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఈటెలపై మళ్ళీ కే‌సి‌ఆర్ ఫోకస్ ?

జగన్ ధీమా అదే.. అందుకే పొత్తులకు నో ఛాన్స్ !

ఒక్క ఛాన్స్ అంటున్న పవన్.. జగన్ కు ఇబ్బందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -