Saturday, May 18, 2024
- Advertisement -

అక్కడ పెద్ద యుద్దమే జరిగింది..

- Advertisement -

ఉత్తర భారతదేశంలో ఇండోర్ లో దీపావళి తర్వాతి రోజు సాయంత్రం కాగానే హింగోట్ అనే ఓ యుద్ధం షురూ అయింది. ఒకరిపైకి ఒకరు హింగోట్ల వర్షం కురిపించుకున్నారు. గాయాలైనా సరే ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా ఉత్సాహంతో యుద్ధాన్ని కొనసాగించారు. ఇదంతా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దీపావళి మర్నాడు జరిగిన తంతు. హింగోట్ల యుద్ధం సాంప్రదాయంగా అక్కడ ప్రతిఏడాది జరుగుతూ వస్తోంది.

ఈ ప్రాసెస్ లో భాగంగా ఇండోర్‌లోని గౌతమ్‌పూర్‌కు చెందిన జాంబాజ్ తుర్ర్, రుణాజీకిచెందిన కలంగీ యోథుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇండోర్‌లోని దేవనారాయణ మందిరం సమీపంలో గల మైదానంలో సాయంత్రం థోక్ పడ్వా పర్వదినం పేరిట ఈ యుద్ధం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు హింగోట్లు విసుకుని ఆనందించారు.

ఐతే ఈ యుద్దంలో 23 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. హిరోరియా అనే చెట్టుకు భారీ ఆకారం గల కాయలుంటాయి. వీటి తొక్క కొబ్బరి చెక్కలా ఉంటుంది. ఈ ఉత్సవానికి ముందు వీటిని ఎండబెట్టి, లోపల డొల్లగా చేసి ముందుగుండు నింపుతారు. వీటినే హింగోట్లుగా పిలుస్తారు. వీటిని వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకోవడాన్ని వేడుకగా భావిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -