Saturday, April 20, 2024
- Advertisement -

మధ్యప్రదేశ్​లో గ్రీన్​ఫంగస్​..

- Advertisement -

కరోనాతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కరోనా దెబ్బకు ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగుల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా బాధితుల పరిస్థితి వర్ణనాతీతం. ఆస్పత్రిలో లక్షల ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకున్న వారు సైతం ఉన్నారు.ఫస్ట్​వేవ్​ లోనే ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక సెకండ్​ వేవ్​ సైతం బతుకులను ఆగం చేసింది. ఇదిలా ఉంటే కరోనా పేరిట చేసిన వైద్యంతో కొత్త రోగాలు వచ్చి పడ్డాయి. అందులో బ్లాక్​ఫంగస్​ ఒకటి. కరోనా వచ్చి కోలుకున్నా ఎంతో మంది బ్లాక్​ఫంగస్​తో ప్రాణాలు కోల్పోయారు.

కొద్ది రోజులు వైట్ ఫంగస్ కూడా భయపెట్టింది.ఇప్పుడు కరోనా పేషెంట్లకు మరో కొత్త వ్యాధి వస్తున్నదట. అదే గ్రీన్​ ఫంగస్​. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఓ వ్య‌క్తికి గ్రీన్‌ఫంగ‌స్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు గుర్తించారు. ఇండోర్‌లోని రూబీ ఆర్చర్డ్‌ రోడ్డు లో ఉంటున్న ఓ వ్యక్తి (34) కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడి కోలుకున్నాడు.

Also Read: పిల్లలపై వ్యాక్సిన్​ ప్రయోగాలు సక్సెస్​..!

అయితే మ‌ళ్లీ అతడిలో కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరాడు. అత‌డికి వైద్య ప‌రీక్ష‌లు చేయగా.. ఊపిరితిత్తులు, సైనస్‌లో ఆస్పెర్‌గిలోసిస్ ఫంగస్‌ను గుర్తించిన‌ట్టు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో 90శాతం ఇన్ఫెక్షన్‌ జరిగిందన్నారు.అయితే బ్లాక్​ ఫంగస్​లాగానే ఇది కూడా ఎంతో డేంజర్​ అని వైద్యులు అంటున్నారు. గ్రీన్​ ఫంగస్​ వల్ల ఊపిరితిత్తులు తొందరగా పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read: తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తివేత?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -