Saturday, May 18, 2024
- Advertisement -

నేపాల్‌లో కుప్ప‌కూలిన విమానం..

- Advertisement -

నేపాల్‌లోని ఖాట్మాండ్‌లోని త్రిభువ‌న్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఓ విమానం కుప్ప‌కూలింది. బంగ్లాదేశ్‌కు చెందిన యూఎస్ బంగ్లాకు చెందిన విమానం ఢాక నుంచి ఖాట్మాండ్‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 2.20 గంట‌ల‌కు విమానాశ్ర‌యానికి చేరుకుంది. ఆ విమానంలో మొత్తం 78 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఖాట్మాండు విమానాశ్ర‌యంలో దిగుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

ల్యాండింగ్ స‌మ‌యంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో మంట‌లు వ్యాపించిన‌ట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నాయి.

విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దీంతో విమానం కుప్పకూలిపోయిందని స‌మాచారం. నేపాల్‌ ఆర్మీ సిబ్బంది ఎయిర్‌పోర్టుకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 17 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయాన్ని మూసేశారు. విమానం తీవ్రంగా దెబ్బ‌తిన‌డంతో ప్ర‌యాణికులు మృతిచెంది ఉంటార‌ని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -