ఇండోనేషియాలో తప్పిపోయిన జలాంతర్గామి ఆచూకీ దొరికింది. బాలి ద్వీపానికి సమీపంలో సముద్రపు లోతుల్లో కనిపించింది. లాంతర్గామిలో ఉన్న 53 మంది సిబ్బంది మృతి చెందినట్టు పేర్కొంది. మునిగిపోయిన ‘కేఆర్ఐ నంగాలా 402’ మూడు ముక్కలైందని నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుడో మర్గోనో తెలిపారు. అందులో ఉన్న 53 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారని ఇండోనేషియా మిలటరీ హెడ్ హాదీ జయంతో తెలిపారు.
850మీటర్లు (2800 అడుగులు)లోతున జలాంతర్గామి వున్నట్లు స్కాన్‌లో వెల్లడైంది. టార్పెడో డ్రిల్ సమయంలో మునగడానికి అనుమతి కోరిన తర్వాత అది కనిపించకుండా పోయింది. జర్మనీలో తయారైనన ఈ జలాంతర్గామి వయస్సు 40ఏళ్ళ పైమాటే. 2012లో దీనికి పూర్తిస్థాయిలో పునరుద్దరణ పనులు జరిగాయి.
జలాంతర్గామి పూర్తిగా పనిచేసే కండీషన్‌లోనే వుందని నేవీ అధికారులు చెప్పారు. కకు సంబంధించి నిన్న పలు భాగాలు గుర్తించినట్టు తెలిపారు. ఇందులో లంగరు, సిబ్బంది ధరించిన సేఫ్టీ సూట్స్ ఉన్నట్టు జయంతో పేర్కొన్నారు. బుధవారం ఉదయం ప్రాక్టీస్ సమయంలో జలాంతర్గామి తప్పిపోయింది.
జలాంతర్గామి పేలినట్లయితే అది ముక్కలుగా విరిగిపోయేదని ఇండోనేషియా నావికాదళ అధిపతి యుడో మార్గనో బాలిలో మీడియాతో చెప్పారు. అలాగే, పేలుడు శబ్దం సోనార్‌లో కూడా నమోదవుతుందని తెలిపారు. అయితే మునిగిన చోట చమురు తెట్టు కనిపిస్తుండడంతో బహుళా ఇంధన ట్యాంక్ దెబ్బతిని వుంటుందని ఆందోళనలు తలెత్తాయి.
ఎన్నో కష్టాలు ఎదిరించిన గొప్ప నటుడు పొట్టి వీరయ్య : చిరంజీవి