Sunday, May 19, 2024
- Advertisement -

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలుకు చిదంబరం…

- Advertisement -

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరానికి షాక్ తగిలింది. యూపీఏ హయాంలో ఓవెలుగు వెలిగిన చిదంబరం ఇప్పుడు తీహార్ జైలు ఊసలు లెక్కపెట్టనున్నారు.ఈ కేసు విచారణ నిమిత్తం చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్‌ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 19 వరకు అక్కడే ఉండనున్నారు చిదరబరం. సీబీఐ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరంను గురువారం కోర్టులో హాజరపరిచారు. దాంతో ఆయన్ను జుడిషియల్ కస్టడీకి అప్పగించింది స్పెషల్ కోర్టు.

జైల్లో చిదంబరానికి ప్రత్యేక సెల్‌ను కేటాయించాలని కోర్టు ఆదేశించింది. జెడ్ కేటగిరి భద్రత దృష్యాలో జైల్లో ప్రత్యేక సదుపాయాలకు కూడా కల్పించింది.వెస్ట్రన్ టాయిలెట్‌ సౌకర్యంతో పాటు మందులను అందించేందుకు అనుమతిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -