Sunday, May 19, 2024
- Advertisement -

జేఈఈలో రికార్డ్.. ఏడాదికి నాలుగు సార్లు ..!

- Advertisement -

దేశవ్యాప్తంగా ఈసారి జేఈఈ మెయిన్‌-2021ను నాలుగుసార్లు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు తరగతి గదికి దూరమైనందున బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లోనూ ఛాయిస్‌ ఇవ్వనుంది. జాతీయస్థాయి ప్రవేశ, బోర్డు పరీక్షలు, సిలబస్‌ తదితర అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

పలువురు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. జేఈఈ మెయిన్‌పై ఇప్పటికే పలు సూచనలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి నెలాఖరులో ఒకటి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగుసార్లు పరీక్ష నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. ప్రతి విద్యార్థి నాలుగు విడతల్లోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు ఇచ్చే అంశాన్ని సానుకూల దృకృథంతో పరిశీలిస్తామన్నారు. ప్రతి విడతలో 3-4 రోజుల చొప్పున పరీక్షలు ఉంటాయన్నారు.

ఈసారి జేఈఈ మెయిన్‌కు పాత పాఠ్య ప్రణాళికే (సిలబస్‌) ఉంటుందని, కాకపోతే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఛాయిస్‌ ఇవ్వాలనే ఆలోచన ఉందని మంత్రి స్పష్టం చేశారు. ‘గతంలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో కలిపి 75 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చి, ఒక్కోదానిలో 25 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే ఆ మేరకు మార్కులు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’ అని చెప్పారు. నీట్‌కు కూడా గతేడాది పాఠ్య ప్రణాళిక యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -