Monday, May 20, 2024
- Advertisement -

ప‌ర్యాట‌కు అంబాసిడర్‌ రేసులో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పోటీగా సింధూ…?

- Advertisement -

సీఎం వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోనున్నారు. ప‌రిపాల‌న‌లో సంల‌న నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్న జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం వైపు ఆడుగులేస్తున్నారు. దేశంలోనే రెండో పొడవైన తీరప్రాంతంతో పాటు పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇతర పర్యాటక స్ధలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు గత ప్ర‌భుత్వం సీరియస్ గా దృష్టిపెట్టలేదు. ప‌ర్యాట‌క రంగం అభ‌వృద్ధికి అనుకూల‌త‌లు ఉన్నా అది ప్ర‌త్యామ్నాయంగానె నిలిచిపోయింది.

రాష్ట్రంలో తాజాగా అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు పర్యాటక రంగాన్ని తమ ప్రాధాన్య రంగాల జాబితాలో చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మ్యూజియాలు, పర్యాటక జోన్ల అభివృద్ధికి సత్వర ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యాటక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఈ దిశగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.దీనిలో భాగంగానె ప‌ర్యాట‌క రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించేందుకు జగన్ సర్కారు కొత్త బ్రాండ్ అంబాసిడర్ ను కూడా నియమించబోతోంది.

కొత్త బ్రాండ్ అంబాసిడర్స్‌కొసం ప్ర‌ధానంగా ఇద్ద‌రు సెల‌బ్రిటీల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. వారిలో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మ‌రొక‌రు స్టార్ షట్లర్ పీవీ సింధు పేరు కూడా పరిశీల‌న‌లో ఉన్నాయి.మంత్రి కొడాలి నానితో పాటు ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ నేతలే కావడంతో వీరి నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు ఎన్టీఆర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

పర్యాటక బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ తగిన వ్యక్తిగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బ్యాడ్మింట్ లో అంతర్జాతీయంగా ఘనవిజయాలు అందుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు పేరు కూడా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ జాబితాలో వినిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ లేదా సింధులో ఒకరు ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఎవ‌రికి ఓటు వుస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -