Wednesday, May 22, 2024
- Advertisement -

భవిష్యత్ పోరాటం గురించి చర్చ

- Advertisement -

కాపు నాయకులు ఏకం అవుతున్నారు. కాపుల రిజర్వేషన్, కాపు యువకుల అరెస్టులు, ముద్రగడ పద్మనాభం దీక్ష, ఆసుపత్రిలో చేరిక వంటి పరిణామాల నేపథ్యంలో వివిధ పార్టీల్లో ఉన్న నాయకులంతా ఏకమవుతున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కాపు నాయకులు బొత్స సత్యనారాయణ, ప్రముఖ దర్శకుడు దాసరి నారా‍యణ రావు, మెగాస్టార్ చిరంజీవి, సి.రామచంద్రయ్య వంటి వారు సమావేశమయ్యారు.

వీరితో పాటు మరికొందరు కాపు నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కాపుల రిజర్వేషన్ తో పాటు, తుని ఘటనకు సంబంధించి జరుగుతున్న అరెస్టుల పర్వంపై కూడా వీరి చర్చించినట్లు సమాచారం. కాపుల సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ చిరంజీవి హెచ్చరించారు. ఒకటి రెండు రోజుల్లో ముద్రగడను కలిసి భవిష్యత్ కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకోవాలని వారంతా నిర్ణయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -