Saturday, May 18, 2024
- Advertisement -

చంద్రబాబు కి అటు కాపులు, ఇటు బీసీ లు – చుక్కలు చూపిస్తున్నారు

- Advertisement -

కాపు గర్జన కి ఊహించని హింస ప్రభుత్వాన్ని కిందకి దించేసింది. ఊహించని సంఘటన నేపధ్యం లో పోలీసులు సైతం చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చేసింది. కాపులకి రిజర్వేషన్ ల కోసం కాపులు గొడవ చేస్తూ ఉంటే మరొక పక్క మేమేమీ తక్కువ తినలేదు అంటూ బీసీ లు మొదలు అయ్యారు.

వారికి గనక రిజర్వేషన్ లు ఇచ్చి తమకి అన్యాయం చేస్తే ప్రభుత్వం మెడ వంచైనా దాన్ని అడ్డుకుంటాం అని వారు గొడవ చేస్తున్నారు . తమ సత్తా నిరూపించడం కోసం  కాకినాడలో భారీ బహి రంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాపులు ప్రభుత్వాన్ని బెదిరిం చేందుకే తునిలో ఘర్షణలు సృష్టించారని భావిస్తున్న బీసీలు ఆ విధంగా ఒకవేళ ప్రభుత్వం బెదిరింపులకు తలొగ్గితే తాము కూడా జిల్లాకో సభ నిర్వహించి రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు.

కాపుల కంటే జనాభా విషయం లో తాము ఎక్కువ కాబట్టి ఆ రకంగా తమ సంఖ్యా బలం చాటుకుని మరీ ప్రభుత్వానికి హెచ్చరిక ఇవ్వాలి అని చూస్తున్నారు.తెలుగు దేశం పార్టీ సొంత ఎమ్మెల్యే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ క్రిష్నయ్య పార్టీ కి ఎదురు తిరగడం ఆశ్చర్యకరం. టీడీపీ కి కాపులు కావాలా , బీసీ లు కావాలా తేల్చుకోవాలి అని సంఘాల వారు అంటున్నారు. చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు డైలమా లో పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -