Friday, May 17, 2024
- Advertisement -

త‌న పంథాన్ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న య‌డ్యూర‌ప్ప‌…

- Advertisement -

స్ప‌ష్ట‌మైన మెజారిటీ అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య క‌ర్నాట‌క సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారంచేసి త‌న పంథాన్ని ఎట్టేకేల‌కు నెగ్గించుకున్నారు య‌డ్యూర‌ప్ప‌. అదే విధంగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. రూ.56 వేల కోట్ల రైతుల రుణాల‌మాఫీ ఫైల్‌పై మొదటి సంత‌కం చేసి సంచ‌ల‌నం సృష్టించారు.

దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు… ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయన చెప్పారు. మరోవైపు, బలనిరూపణ కోసం యోడ్డీకి కర్ణాటక గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో కేబినెట్ కొలువుతీరిన తర్వాత ఆయన మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

రైతు వ్యతిరేక నిర్ణయాల కారణంగానే సిద్దరామయ్య ప్రభుత్వం ఓడిపోయిందన్న విషయాన్ని గమనించిన యడ్యూరప్ప.. సీఎంగా ప్రమాణ స్వీకారం మొదలు మొదటి నిర్ణయం వరకు రైతు అనుకూల వైఖరిని అనుసరించారు.

రైతులకు సంఘీభావంగా ఆకుపచ్చ కండువా కప్పుకొని ప్రమాణం స్వీకారం చేసిన యడ్యూరప్ప.. దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందితే రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -