Thursday, May 16, 2024
- Advertisement -

బలపరీక్షలో నెగ్గిన కుమారస్వామి..బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే భాజాపా వాకౌట్‌..

- Advertisement -

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుమారస్వామి ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ నేత యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు స్పీకర్ రమేశ్ కుమార్, సీఎం కుమారస్వామి పదే పదే వారిస్తున్నా యడ్యూరప్ప తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు. .

అధికార‌పార్టీ స‌భ్యులు ప‌దే ప‌దే అడ్డుత‌గులుతుంటే య‌డ్యూర‌ప్ప‌తో స‌హా ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో యడ్యూరప్ప సుదీర్ఘంగా మాట్లాడారు. ‘జేడీఎస్, కాంగ్రెస్‌లది అపవిత్ర కలయిక. అధికారం కోసం కుమారస్వామి ఇంతలా దిగజారుతారనుకోలేదు. గతంలో ఆయనతో కలిసి అధికారం పంచుకున్నందుకు సిగ్గు పడుతున్నా. కర్ణాటక ప్రజలను క్షమాపణ కోరుతున్నా. బీజేపీకి 104 స్థానాల మెజార్టీ అందించి కన్నడ ప్రజలు తీర్పు ఇస్తే.. కేవలం 37 సీట్లు వచ్చిన పార్టీ అధికారం చేపట్టడం దారుణం’ అని యడ్యూరప్ప అన్నారు.

కుమారస్వామి తీరుకి నిరసనగా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు కుమారస్వామి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 24 గంటల్లో రైతు రుణమాఫీ చేయకపోతే ఈ నెల 28న కర్ణాటక బంద్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం యడ్యూరప్ప తాము వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. ఈ పరిణామంతో విశ్వాస పరీక్షలో కుమారస్వామి విజయం లాంఛనం అయింది. జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి సభలో సంఖ్యాబలం ఉండటంతో కుమారస్వామి సులభంగా నెగ్గారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామి విజయం సాధించినట్లు ప్రకటించి స్పీకర్ రమేశ్ కుమార్ సభను వాయిదా వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -